ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి భారీ ఆస్తి నష్టం , ప్రాణ నష్టం చేయగా..తాజాగా మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాష్ట్ర ప్రజలను షాక్ కు గురి చేసింది. గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన మెటీరియల్ రూమ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదం సంభవించగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

అయితే..ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. విషయం తెలుసుకున్న వెంటనే దాచేపల్లి పోలీస్, రెవిన్యూ అధికారులు, అగ్ని మాపక సింబ్బంది సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో అగ్ని మాపక సిబ్బంది ఉన్నారు. ఎగిసిపడటంతో కిలో మీటర్ పరిది వరకు కెమికల్ దుర్వాసన వ్యాపించింది. అధికారులు మంటలను అదుపుచేయక పోతే కెమికల్ దుర్వాసనకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.