ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. ఈ రోజు నుండి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గనున్నట్లు పేర్కొంది. యూనిట్ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్ అందించనున్నారు. సబ్సిడీ విద్యుత్ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం పడనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బీపీఎల్‌లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్