ఏపీలోని విద్యా పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఏపీకి అస్సాం బృందం వచ్చింది. పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంకిపాడు, కోలవెన్ను మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలను అస్సాం సమగ్ర శిక్ష మిషన్ డైరెక్టర్, విద్యాశాఖ కార్యదర్శి రోషిణీ అపరంజి కొరాటి పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలు స్ఫూర్తిదాయకం. సీఎం వైయస్ జగన్ విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత బాగుంది. కోవిడ్ ప్రభావంతో పాఠశాలలు తెరవడం ఆలస్యమైనా పాఠశాలల ప్రాంగణం, నిర్వహణ తీరు ఆహ్లాదకరంగా ఉంది అని అన్నారు.