ఏపీ కరోనా విలయతాండవం : 77 మంది మృతి , 9,999 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పదివేల కేసులు , పదుల సంఖ్య లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో 9,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 77 మంది వైరస్ తో మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 47,686కి చేరుకోగా… కరోనాబారినపడి 4,779 మంది మరణించారు. ఇక కరోనాబారిన పడి ఇప్పటి వరకు 4,46,716 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 96,191కు తగ్గాయి.

ఇక జిల్లావారీగా కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి..

#COVIDUpdates: 11/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,44,791 పాజిటివ్ కేసు లకు గాను
*4,43,821 మంది డిశ్చార్జ్ కాగా
*4,779 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,191#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/V3a7QlQRN0— ArogyaAndhra (@ArogyaAndhra) September 11, 2020