ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు పదివేలకు పైగా కేసులు , పదుల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 10,418 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5, 27, 513 కి చేరాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో 74 మంది మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4634కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97271 కేసులు యాక్టివ్ గా ఉండగా, 425607 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లా వారీగా కేసులు ఈ కింది విధంగా ఉన్నాయి.
#COVIDUpdates: 09/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,24,617 పాజిటివ్ కేసు లకు గాను
*4,22,712 మంది డిశ్చార్జ్ కాగా
*4,634 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,271#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/cfzhuSxV1S— ArogyaAndhra (@ArogyaAndhra) September 9, 2020