ఏపీలో కరోనా కేసులు ,మరణాలు ఏమాత్రం కంట్రోల్ కి రావడం లేదు. ప్రతి రోజు వేలకొలది కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 70,511 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 8,846 పాజిటివ్ కేసులు రాగా 69 మంది కన్నుమూశారు.
ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు చూస్తే..మంగళవారం 69 మంది కరోనా కు బలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,041కు చేరుకుంది. ఇక జిల్లాల వైజ్ గా కేసులు చూస్తే..`
#COVIDUpdates: 15/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,81,030 పాజిటివ్ కేసు లకు గాను
*4,83,636 మంది డిశ్చార్జ్ కాగా
*5,041 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 92,353#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/drboBFHxkY— ArogyaAndhra (@ArogyaAndhra) September 15, 2020