ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు , మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,783 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. ఇందులో 24,575 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,92,083 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 14 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,690కు చేరుకుంది.
ఇక రాష్ట్రంలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 170, చిత్తూరులో 351, తూర్పుగోదావరి జిల్లాలో 371, గుంటూరులో 324, కడపలో 169, కృష్ణాలో 425, కర్నూలులో 34, నెల్లూరులో 86, ప్రకాశంలో 134, శ్రీకాకుళంలో 67, విశాఖపట్నంలో 113, విజయనగరంలో 70, పశ్చిమ గోదావరిలో 469 కేసులు నమోదయ్యాయి.