ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత బులెటిన్ కంటే.. మరిన్ని తక్కువ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,367 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,40,730కి చేరింది. ఇందులో 21,434 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,12,517 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 11 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,779కు చేరుకుంది. వీరిలో కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరులో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, కడప, విశాఖ, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
జిల్లాల వారీగా కేసులు చూస్తే.. అనంతపురం 61, చిత్తూరు 255, తూర్పుగోదావరి 386, గుంటూరు 226, కడప 131, కృష్ణా 358, కర్నూలు 37, నెల్లూరు 153, ప్రకాశం 84, శ్రీకాకుళం 102, విశాఖపట్నం 135, విజయనగరం 78, పశ్చిమ గోదావరి 361 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.