ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. మొదట్లో కరోనా ఉదృతి తీవ్రతరంగా ఉన్న సమయంలో ప్రభుత్వం అందరికి కరోనా టెస్టులు చేసి కట్టడి చేయడం తో ప్రస్తుతం సాధారణ స్థితి కి వచ్చాయి. గతంలో పదివేలకు పైగా కేసులు నమోదు అవుతూ రాగా..ప్రస్తుతం వందలకు పడిపోయాయి.
తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,80,075 కు చేరింది. ఇందులో 8.69,124 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,862కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7,089 కు చేరింది.