Site icon TeluguMirchi.com

ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉదృతి చాల తగ్గింది. గతంలో ప్రతి రోజు వేల సంఖ్య లో కొత్త కేసులు నమోదు అవుతూ వచ్చేవి..కానీ ఇప్పుడు వందల సంఖ్యలోకి వచ్చాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖా విడుదల చేసిన కరోనా బుల్టిన్ ప్రకారం..రాష్ట్రంలో కొత్తగా 379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 490 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందారు.

ఏపీలో ఇప్పటివరకు 8,79,718 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,68,769 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,864 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,085 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 57,716 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,14,15,246 శాంపిళ్లను పరీక్షించినట్లు బులిటిన్ లో తెలిపారు.

Exit mobile version