ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సెంచరీలు కొడుతుంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,636కి చేరింది.
ఈ వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు 80 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 2465 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, మరో 3091 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన పాజటివ్ కేసుల్లో 141 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉండగా, ఇతర రాష్ట్రాలకి నుంచి వచ్చినవారు 64 మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖా తెలియపరిచింది.