ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరుగులు పెడుతూనే ఉంది. ప్రతి రోజు పదివేలకు పైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 10,794 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా లెక్కలతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. కరోనాను జయించి వీరిలో 3,94,019 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం99,689యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,417 మంది మరణించారు.
పూర్తి కేసుల విషయానికి వస్తే..
#COVID19India#AndhraPradesh
New Cases – 10,794
Active Cases – 99,689
Total Cases – 4,98,125#WearAMask#DonatePlasmaSaveLives pic.twitter.com/wmTTuQwex7— BARaju (@baraju_SuperHit) September 6, 2020