ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. ఆదివారం కొత్తగా 813 మందికి కరోనా సోకగా.. మరో 12 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13,098 దాటింది. కరోనా మరణాలు 169కి చేరాయి.
శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 813 కేసులు నిర్ధారణ కాగా.. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 755 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 50 మంది, విదేశాల నుంచి వచ్చినవారు 8 మంది ఉన్నారు. గడచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొరు మృతి చెందారు.