రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా టెస్టుల ధరలు తగ్గించిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల ధరలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగ్గించి కాస్త ఊరట కల్పించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయి లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు పది వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం తో ప్రజల్లో ఆందోళన , భయం నెలకొంటుంది. ఏమాత్రం కాస్త జ్వరం అనిపించినా టెస్ట్ లు చేయించుకుంటున్నారు. ఇదే అదును చేసుకొని ప్రైవేట్‌ ల్యాబ్స్‌లలో ఇష్టారాజ్యంగా టెస్ట్ ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. దీనిపై దృష్టి పెట్టిన జగన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసారు.

గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ.2400 ఉన్న ధరను రూ.1600కు కుదిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్‌గా ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన రూ.2900 ధరను రూ.1900 కుదిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం తెలిపింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.