ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కరోనా మాత్రం కంట్రోల్ కు రావడం లేదు. శనివారం కూడా బరి సంఖ్య లోనే కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 20,590 మందికి పరీక్షలు నిర్వహించగా 1775 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 1813కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 27,235కు చేరింది.
గత 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 300, కర్నూలులో 229, తూర్పుగోదావరి జిల్లాలో 143, పశ్చిమ గోదావరి జిల్లాలో 84, గుంటూరు జిల్లాలో 68, ప్రకాశం జిల్లాలో 63, కడప జిల్లాలో 47, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 76, శ్రీకాకుళం జిల్లాలో 204, కృష్ణా జిల్లాలో 123, నెల్లూరు జిల్లాలో 76 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 3,168 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 3,161, గుంటూరు జిల్లాలో 2867 కేసులు నమోదయ్యాయి.