ఏపీలో కరోనా పంజా : 10,175 కేసులు , 68 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతూనే ఉంది. ప్రతి రోజు పదివేల కేసులు , పదుల సంఖ్య లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో 72,229 శాంపిల్స్ పరీక్షించగా మరో 10175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5,76,687కు చేరింది. అలాగే గడచిన 24 గంటల్లో 68మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4702కి చేరింది.

ఇక కేసులు విషయానికి వస్తే..

నెల్లూరు జిల్లా 823, శ్రీకాకుళం జిల్లా 664, కడప జిల్లాలో 576, కృష్ణా జిల్లాలో 545, విజయనగరం జిల్లా 516, కర్నూలు జిల్లా 482, అనంతపురం జిల్లా 422, తూర్పుగోదావరి జిల్లాలో 1412, ప్రకాశం జిల్లాలో 1386, పశ్చిమగోదావరి జిల్లా 1139, , విశాఖపట్నం జిల్లాలో 404, చిత్తూరు జిల్లా 968, గుంటూరు జిల్లా 838 కేసులు నమోదయ్యాయి.