ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 14,35,491 మంది వైరస్ బారిన పడగా మొత్తం 2,10,436 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 21,101 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 12,15,683 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 101 మంది మరణించారు, దీంతో రాష్ట్రంలో కొవిడ్ వల్ల 9372 మంది మరణించారు.