కరోనా విషయంలో ఏపీ కి ఫస్ట్ ప్లేస్ దక్కింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజు కు పెరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో కరోనా కట్టింది చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుప్పటికీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారి కారణంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ కి మొదటి స్థానం దక్కింది.

కరోనా పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి పది లక్షల జనాభాకు సగటున 830 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇక 809 మందికి పరీక్షలు నిర్వహిస్తూ రెండో స్థానంలో రాజస్థాన్‌ ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 41,512 మందికి పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల్ని త్వరగా గుర్తించేందుకు టెస్టుల సామర్ధ్యాన్ని పెంచుతూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.