ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గత 24 గంటల్లో 19,085 శాంపిల్స్ పరీక్షించగా 477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 69మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో 7గురికి వైరస్ సోకింది.
దీంతో మొత్తం కేసులు 553కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 10884 చేరింది. గడచిన 24 గంటల్లో ఏడురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 136కి చేరింది. గత 24 గంటల్లో 118మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాలవారీగా చూస్తే..
కర్నూలు జిల్లాలో 72, గుంటూరు జిల్లాలో 67, అనంతపురం జిల్లాలో 52, తూర్పుగోదావరి జిల్లాలో 64, కృష్ణా జిల్లాలో 47, చిత్తూరు జిల్లాలో 42 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 40, నెల్లూరు జిల్లాలో 29, కడప జిల్లాలో 22, పశ్చిమగోదావరి జిల్లాలో 18, ప్రకాశం జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1555పాజిటివ్ కేసులు.. తర్వాత కృష్ణా జిల్లాలో 1179 కేసులు ఉన్నాయి.. అనంతపురం జిల్లాలో కేసులు 1080కు చేరాయి.