ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 48 కేసులు నమోదు అయ్యాయి. ఈ 48 కేసులతో కలిపి మొత్తం 2,200 దాటేశాయి. తాజాగా ఒకరు మృతిచెందడంతో.. మృతుల సంఖ్య 49కి చేరింది. ఇక, 1,353 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 803 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ అత్యధికంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరులో 9 చొప్పున కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 8 కృష్ణా జిల్లాలో 7, విశాఖపట్నంలో 4, కడప, పశ్చిమ గోదావరిలో ఒక కేసు చొప్పున నమోదు అయ్యాయి