ఏపీ లో కొత్తగా 947 కరోనా కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 947 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,97,810 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 4,715 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 377 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,85,892 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ ఒక్క మరణం కూడా సంభవించలేదు.