Site icon TeluguMirchi.com

ప్రధాని పదవిపై చంద్రబాబు మనసులోని మాట.. !

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారత ప్రధాని అయ్యేందుకు అన్నీ అర్హతలు ఉన్నాయన్నది అప్పుడు.. ఇప్పటికీ వినిపించే మాట. ఇప్పుడీ మాటలు లండన్ లోనూ వినిపించాయి. లండన్’లో పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడ ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ పీకాక్ లీడర్ షిప్’ అవార్డును అందుకున్నారు. పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డు ప్రధానోత్సవంలో కొందరు వక్తలు భారత ప్రధాని అయ్యేందుకు చంద్రబాబుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. దీనిపై స్పందించిన బాబు.. ఎప్పటిలాగే తనకు ఏపీ అభివృద్ధియే ముఖ్యం. ప్రధాని పోటీలో నేను లేను అంటూ సమాధానమిచ్చారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, పెట్టుబడులతో రావాలంటూ అక్కడున్న పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

Exit mobile version