రేపే మంత్రి వర్గ విస్తరణ.. గవర్నర్‌ నో అంటున్నాడట!!

ap cm cbnగత రెండున్నర సంవత్సరాలుగా ఏపీ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్దం అయ్యాడు. రేపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ మంత్రులకు ఉద్వాసన పలకనున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది.

చినబాబు లోకేష్‌కు ఇప్పటికే మంత్రి వర్గంలో చోటు ఖాయం. అలాగే వైకాపా నుండి వచ్చిన అఖిల ప్రియకు కూడా మంత్రి పదవి ఖాయం. వీరితో పాటు వైకాపా నుండి వచ్చిన మరో ఇద్దరు కూడా రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వైకాపా నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంను గవర్నర్‌ వ్యతిరేకిస్తున్నాడు. వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారితో ప్రమాణ స్వీకారం చేయించను అంటూ గవర్నర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం గవర్నర్‌ను ఒత్తిడి చేస్తున్నారు.