ప్రపంచ ఆర్థిక సదస్సుకు దుబాయి వేదిక కాబోతుంది. అక్కడ పలు కంపెనీల సీఈఓలు హాజరు కాబోతున్నారు. అందుకే అక్కడకు వెళ్లి కంపెనీలను తీసుకు రావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీ ఎంపీలు పార్లమెంటులో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు.
ఏపీకి బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీలో బంద్ కూడ నిర్వహించారు. రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతున్న ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దుబాయికి వెళ్లడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని కొందరు సొంత పార్టీ నాయకులు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు వారి విమర్శలను పట్టించుకోకుండా దుబాయి వెళ్తాడా లేదా మరెవ్వరినైనా పంపిస్తాడా అనేది చూడాలి.