ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గత మూడు రోజులుగా నిరసనగా తెలుగు దేశం ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. బడ్జెట్‌తో ఏపీకి తీవ్ర అన్యాయం చేశారు అంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎంపీలు గత మూడు రోజులుగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి చర్చలకు ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోడీతో మంత్రి సుజన చౌదరి మాట్లాడటం జరిగింది.
పలు విషయాలపై తమకు హామీ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేసి సుజన చౌదరి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. సుజనాతో చర్చలు విఫలం అవ్వడంతో ప్రధాని స్వయంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడానే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తమ ఎంపీల ఆందోళన విరమింపజేయాలని, తప్పకుండా ఏపీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు స్వయంగా మోడీ ఫోన్ చేసి బుజ్జగిస్తే పంతం నెగ్గించుకున్నట్లు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడుకు మోడీ ఫోన్ చేసేనా, బుజ్జగించేనా చూడాలి.