2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్త పొత్తులు ఏపీలో పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాతో కలిసి పోటీ చేయాలని ఆశపడుతున్నట్లుగా అనిపిస్తుంది. పార్టీ జాతీయ నాయకత్వం విషయం పక్కన పెడితే రాష్ట్ర నాయకత్వం మాత్రం జగన్ మంత్రంను జపిస్తూ, చంద్రబాబు నాయుడును తూలనాడుతున్నారు.
ఇప్పటికే పలువురు ఏపీ బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. అయినా కూడా తెలుగు దేశం పార్టీ నాయకులు మిత్రధర్మంను పాటిస్తూ స్నేహంను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు రోజు రోజుకు ముదిరి పోయి మాట్లాడుతున్నారు. దాంతో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పొత్తు విషయమై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
బీజేపీ నాయకులు ఇప్పటికే పలు సార్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ సర్దుకు పోతుంటే బీజేపీ మాత్రం పట్టించుకోకుండా వైకాపాతో పొత్తుకోసం ప్రాకులాడుతుంది. ఒక వేళ బీజేపీ పొత్తు వద్దనుకుంటే నమస్కారం పెట్టి తాము పక్కకు తప్పుకుంటామని ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో 2019లో కొత్త పొత్తులు ఖాయం అంటూ ప్రచారం జరుగుతుంది.