ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరీక్షలు చేయించుకోని అనుమానితులు పెద్ద సంఖ్యలో ఉండడంతో కేసులు భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లాలో కొత్త కేసొకటి నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 304కు చేరింది. మరణాలు కూడా 4కు చేరుకున్నాయి
కాగా ఆంద్రప్రదేశ్‌లో కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరగనుంది.
ఇక దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 4421కి చేరుకుంది. 3981 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటుండగా 114 మంది చనిపోయారు. 326 మంది కోలుకున్నారు. గత 24గంటల్లో 354 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.