ఏపీ రాజధాని.. రేపే రిలీజ్ !

ap-capital-confirmed
నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ? అనే ఉత్కంఠకు రేపటి (బుధవారం)తో తెరపడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ రాజధానిపై రేపు అసెంబ్లీ ప్రకటన చేయనున్నారు. రాజధాని ఎక్కడ?, ఎన్ని వేల ఎకరాల్లో వుండబోతుంది?, ఎలాంటి హంగులతో.. రూపుదిద్దుకోబోతుంది.. తదితర సంపూర్ణ సమాచారాన్ని బాబు ప్రజలకు వివరించనున్నారు.

ఏపీ రాజధానిపై నియమించబడ్డ శివరామకృష్ణ కమిటీ తన నివేదికను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై సెప్టెంబర్ 1వ తేదిన సమావేశమైన ఏపీ క్యాబినేట్ లోనూ విస్రృతంగా చర్చించి.. తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నిన్న (మంగళవారం) నే అసెంబ్లీ రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేయాల్సివుంది. నిన్న అష్టమి, నేడు నవమి రెండు రోజుల పాటు చెడు దినాలను దృష్టిలో పెట్టుకొని ప్రకటనను గురువారానికి వాయిదా వేసినట్లు సమాచారమ్.

శివరామకృష్ణ కమిటీ వివిధ అంశాలను సిఫారసు చేసిన.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్యే నిర్మించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి పత్తిపాటి పుల్లారావు రావు లాంటి వారు రాజధాని విజవాడే అని తేల్చి చెబుతున్నారు. ఇక, రాజధాని నిర్ణయంపై తమ కేబినెట్ లో ఎలాంటి భేదాభిప్రాయం లేదని మంగళవారం తిరుమలకు వచ్చిన సందర్భంగా ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. ఏపీ రాజధాని గుంటూరు-విజవాడ మధ్యే అని తేలిపోయింది. మిగిలింది అధికారిక ప్రకటననే.ఇక అదీ లాంఛనమే. అయితే, చంద్రబాబు రాజధానిపై ప్రకటనతో పాటుగా, మిగిలిన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను క్కడడెక్కడ నిర్మించబోతున్నమన్న నివేదికను సైతం సవివరంగా ప్రజల ముందు వుందే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.