రాజధాని తరలింపుపై ఫుల్‌ క్లారిటీ

గత కొన్ని రోజులుగా ఏపీ రాజధాని అమరావతి కాకుండా మరో ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వైకాపా ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో సీరియస్‌గా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. మంత్రులు మరియు పార్టీ నాయకులు రాజధాని తరలింపు విషయంలో లీక్స్‌ ఇచ్చారు. కేంద్రం దృష్టికి కూడా రాజధాని మార్పు విషయంను తీసుకు వెళ్లారట. కాని కేంద్రం నుండి సానుకూల నిర్ణయం రాకపోవడంతో చేసేది లేక ఇక అదే స్థానంలో రాజధాని ఉంచాలనే నిర్ణయానికి వచ్చారు.

తాజాగా సీఆర్డీయే అధికారులతో భేటీ అయిన మంత్రి బోత్స ఆ తర్వాత రాజధాని తరలించేది లేదు అంటూ ఫుల్‌క్లారిటీ ఇచ్చాడు. అలాగే మగళగిరి ఎమ్మెల్యే కూడా రాజధాని తరలింపు విషయమై క్లారిటీ ఇచ్చాడు. అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదని, ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దంతం చేస్తున్నాయని, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజధాని మార్పు గురించి మీకు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించాడు.