గురువారం (జూన్ 11) ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగగా..ఇందులో పలు కీలక ఆమోదాలు తెలిపారు.
అవి ఏంటి అనేవి చూస్తే..
* భోగాపురం ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
* ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం
* ఆగస్టు 12న ఈ పధకం ప్రారంభించనున్న జగన్.
* ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుక వంటి విషయాల్లో సీబీఐ విచారణ
* వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ+ పథకాల అమలు.
* హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఇళ్ల పట్టాల పథకంలో చేసిన మార్పులకు కెబినెట్ ఆమోదం.
* తీసుకున్న ఇంటి పట్టాలో ఇంటిని నిర్మించుకుని ఐదేళ్ల నివాసం ఉన్న తరువాతే విక్రయానికి అంగీకారం.
* కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం.. కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం.
* జగనన్న విద్యా దీవెనను నాలుగు విడతలుగా అందివ్వాలని నిర్ణయం.
* మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం నర్సింగ్ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి.
* పగటి పూట రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు కృత నిశ్చయంతో ప్రభుత్వం.
దీని కోసం 10 వేల మెగా వాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్ణయం.
*రామాయపట్నం పోర్టు నిర్మాణం.. మొదటి దశకు అవసరమైన భూ సేకరణకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్.
* గండి కోట రిజర్వాయర్, వెలిగొండ ప్రాజెక్టుల నిర్వాసితులు, ఆర్ అండ్ ఆర్ కోసం నిధుల కేటాయింపునకు నిర్ణయం.
* ఏపీ స్టేట్ డైరక్టరేటాఫ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కెబినెట్ ఆమోదం.. దీనికి అవసరమైన సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్.