Site icon TeluguMirchi.com

ఏపీలో బస్సుల టైమింగ్స్ ఇలా ఉంది..

దాదాపు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కేంద్రం సడలింపులు ఇవ్వడంతో అందులో భాగంగా ఆర్టీసీ సర్వీసులకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా అన్ని డిపోల్లో బస్సులను పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేశారు. సోషల్ డిస్టెన్స్‌ పాటించేలా సిటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడుగంటల వరకూ సర్వీసులు నడుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించిన అధికారులు.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మార్క్ చేశారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. బస్‌స్టాండ్లలో పది రూపాయలకు మాస్కులను విక్రయిస్తున్నారు. డిపో నుంచి డిపోకు మాత్రమే ఏపీ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. భౌతిక దూరం పేరిట ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కుదింపు చేపట్టారు, పల్లెవెలుగులో 56 సీట్లకు బదులు 35, ఎక్స్‌ప్రెస్‌లో 30కి బదులు 20 సీట్లు అల్ట్రా డీలక్స్‌లో 40కి బదులుగా 29, సూపర్‌డీలక్స్‌లో 36కి బదులు 26 సీట్లు మాత్రమే ఉండనున్నాయి.

Exit mobile version