భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో BRS కార్యకలాపాలు జరుగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. అలాగే, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని చెప్పారు. విశ్రాంత IRS అధికారి చింతల పార్థసారధి, టి.జె. ప్రకాష్, తాడివాక రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్ నాయుడు, తదితరులు హైదరాబాద్ తెలంగాణా భవన్ లో కేసీఆర్ సమక్షంలో BRS లో చేరారు.