ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నమోదు అయినా కేసులతో దేశంలో అత్యధిక పాజిటివ్ కేసుల రాష్ట్రంలో ఏపీ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. గడచిన 24 గంటల్లో ఏపీ లో 88 మంది మృత్యువాత పడగా, 10,603 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 12, కడప జిల్లాలో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. ఇతర జిల్లాల్లోనూ కరోనా మహమ్మారి మృత్యుఘోష వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,884కి పెరిగింది.
తాజాగా 9,067 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య3,21,754కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,24,767 కాగా, ఇంకా 99,129 మంది చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 7,64,281 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 1,85,131 ఉన్నాయి. తమిళనాడులో 4,15,590 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం యాక్టివ్ కేసులు మాత్రం కేవలం 52,726 ఉన్నాయి. ఏపీలో మాత్రం 4,24,7679 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు మాత్రం ఏకంగా 99,129 ఉన్నాయి.
#COVIDUpdates: 30/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,21,872 పాజిటివ్ కేసు లకు గాను
*3,18,859 మంది డిశ్చార్జ్ కాగా
*3,884 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,129#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ALarEnJzJl— ArogyaAndhra (@ArogyaAndhra) August 30, 2020