Site icon TeluguMirchi.com

‘టీ’ చర్చలో ఎవరేమన్నారు !

ap assemblyటీ బిల్లు పై చర్చ కొనసాగుతోంది. పండగ సెలవుల తర్వాత ఈ రోజు ప్రారంభమైన సభ మొదట అరగంట వాయిదా పడింది. అనంతరం ప్రారంభమైన సభలో నేతలు మాట్లాడారు

విభజనకు వ్యతిరేకం : విజయమ్మ

రాష్ట్ర విభజనకు అధికార, విపక్ష పార్టీలు కలిసి కుట్ర పన్నాయని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శాసనసభలో ఆరోపించారు. విభజన బిల్లుపై సభలో చర్చ నేపథ్యంలో మాట్లాడిన ఆమె.. విభజనను అడ్డుకోవడమే తమ లక్ష్యమని, దానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తామని అన్నారు. సమైక్యం తమ విధానమని.. విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

వాక్ అవుట్ పద్దతి కాదు : ఆనం
బిల్లుపై శాసనసభలో చర్చను వ్యతిరేకిస్తూ పలుమార్లు సభనుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేయడాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తప్పుబట్టారు. చర్చలో పాల్గొనకుండా ఇష్టం వచ్చినన్ని సార్లు సభనుంచి వెళ్లడం సరైన చర్య కాదన్నారు.

 

బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: శైలజానాధ్

తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్దంగా ఉంది కనుక తాను దీనిని వ్యతిరేకిస్తున్నాని, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఉన్నందున వ్యతిరేకిస్తున్నానని, కాంగ్రెస్ విధానమైన భాషా ప్రయోక్త రాష్ట్రాల విదానానికి వ్యతిరేకంగా ఉన్నందున బిల్లును వ్యతిరేకిస్తున్నాని మంత్రి శైలజనాద్ అన్నారు.

సిగ్గుంటే రాజీనామా చేయండి : ఎర్రబెల్లి

శైలజనాద్ ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేంద్రం పంపిన బిల్లును వ్యతిరేకించిన శైలజానాథ్ కు సిగ్గూ శరం ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో కాస్త గందరగోళం నెలకొంది. ఇంతలో గండ్ర కలుగు జేసుకుని అందరూ సంయమనంతో మాట్లాడాలని సూచించారు.

 

మీ చావు మీరు చావండి అంటున్నారు : జూలకంటి

రాష్ట్ర విభజన వ్యవహారం ఆషామాషీది కాదని.. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి సూచించారు. తాము రాష్ట్రాన్ని విభజిస్తాం.. మీ చావు మీరు చావండి అన్నట్లు వ్యహరిస్తుందని జూలకంటి రంగారెడ్డి కేంద్ర ప్రభుత్వం వైఖరిపై నిప్పులు చెరిగారు. విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలలో వచ్చిన ఉద్యమాల వల్ల రాష్ట్రం లక్షల కోట్ల రూపాయిలను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

విభజనకు నాంది పలికింది వైయస్ : పయ్యావుల

టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదానికి బీజం వేస్తే… ఇప్పటి వైఎస్సార్సీపీ సభ్యులు రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ సభ్యులు బయట ఒక విధంగా, సభలో మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ నుంచి తప్పించుకోవడానికి, ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండేందుకు… వైకాపా ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్ చేస్తున్నారని అన్నారు.

వైఎస్సార్సీపీ డ్రామాలు చేస్తోంది: కేటీఅర్

అంతకు ముందు మాట్లాడిన కేటీఅర్.. టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది దివంగత రాజశేఖర్ రెడ్డే అని తెలిపారు. 42 మందితో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినతి పత్రం ఇప్పించింది వైయస్సే అని అన్నారు. మాతోనే తెలంగాణ వస్తుందని వైయస్ ఒకటికి పదిసార్లు చెప్పారని గుర్తుచేశారు. వైయస్ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు వైఎస్సార్సీపీ సంతోషించాలని అన్నారు. ఓటింగ్ పేరుతో వైఎస్సార్సీపీ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు.

Exit mobile version