రేపటి నుంచే అసెంబ్లీ రణం.. !!

ap assembly sessions

రేపటి (గురువారం) నుంచి అసెంబ్లీ సాక్షిగా రాజకీయ నాయకులు కత్తుదూసుకోనున్నారు. తమకే అలవాటైన.. అత్యంత నీ(చ)తివంతమైన భాషను ఉపయోగించేందుకు రెడీ అయిపోయారు. మాములాగా సమావేశాల్లో అయితే పార్టీలుగా విడిపోయి పదప్రయోగం ప్రయోగించే వారు మన రాజకీయ నాయకులు. రాష్ట్ర విభజన పుణ్యమా అని.. నేతలు ఈ సారి ప్రాంతాలుగా విడిపోయి పోరుకు సిద్దమౌతున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ  మావేశాల్లోనే అసెంబ్లీకి రానుండటంతో.. పార్టీలు గీర్టీలు జాన్ తా నై అంటున్నారు. ప్రాంతాలు.. వాదాలే ముఖ్యమని డిసైడ్ అయ్యారు.

మరోవైపు, పోలీసులు భద్రతపై దృష్టిసారించారు. ఈ నెల 12(రేపటి) నుంచి అసెంబ్లీ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి నగర పోలీసులు ప్లాన్లను రెడీ చేస్తున్నారు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల పరిధిలో సభలు, సమావేశాలు, ధర్నాలకు అనుమతి లేదని, సిటీ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుకుండా వేయ్యి మంది పోలీసులతో అసెంబ్లీ చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మొత్తంమ్మీద ఈసారి సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రపంచంలో ఎక్కడ.. ఎప్పుడు వినపడని తిట్ల దండకాలను సైతం వినిపించేందుకు మన రాజకీయ నాయకులు కూడా రెడీ అయిపోయారు. ఇంకేం ఆలస్యం.. అసెంబ్లీ రణాన్ని వీక్షించండి.. ఆ నీ(చ)తి పదాలను మాత్రం విని.. వదిలేయండి.. !