Site icon TeluguMirchi.com

సొంత పార్టీలోనే ప్రతిపక్షం.. ఇది టీడీపీ రికార్డు !

ఏపీ టీడీపీలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో ప్రభుత్వ-ప్రతిపక్ష పాత్రని పోషించాల్సి వచ్చింది. ఈరోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలని వైకాపా బహిష్కరిస్తున్నట్టు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో.. అసెంబ్లీలో హడావుడి కనిపించలేదు. సభ మొదలు కావాడానికి కొద్దిసేపటి ముందు హాలులో ప్రతిపక్ష పాత్ర పోషించెదెవరు ? అనే సందేహం టీడీపీకి వచ్చింది. దీనికి మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు.

సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు లోకేష్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభలో టీడీపీ రెండు భాగాలు విభజించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులని ప్రశ్నలని అడుగుతారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంకేతాలిచ్చాడని చెప్పారు. ఆట కోసం జట్లని పంచినట్టుగా ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలుగా, మంత్రులు అధికార పక్షంగా వ్యవహిరిస్తారని తెలిపారు. నిజంగా సభలోనూ అదే జరిగింది.

టీడీపీ, భాజాపా నేతలు మాత్రమే సభకు హాజరయ్యారు. దీంతో.. ఎప్పుడు ఉండే హాట్ హాట్ చర్చ ఈసారి ఏపీ అసెంబ్లీలో కనిపించలేదు. ముఖ్యంగా చంద్రబాబు వర్సెస్ జగన్ ఏపీసోడ్ ని ఈసారి జనాలు మిస్సయినట్టే.

Exit mobile version