గడువు ‘6’ వారాలు.. !

t-billటీ-బిల్లు ఈ పార్లమెంట్ సమావేశాల్లో వస్తోందా.. ? వస్తే.. ఎప్పటిలోగా వస్తోంది.. ? లేదంటే.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయనున్నారా…  ? ఈ అంశాలన్నీ కూడా టీ-బిల్లుపై రాష్ట్రపతి అసెంబ్లీకి ఇచ్చే గడువుపైనే ఆధారపడి వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే అందరూ.. అసెంబ్లీకి టీ-బిల్లు ఎప్పుడు వస్తుందన్న దానిపై ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే,  తాజాగా, టీ-బిలుపై అభిప్రాయం చెప్పేందుకు గానూ.. రాష్ట్రపతి అసెంబ్లీకి 6వారాలు అంటే 40రోజుల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. పలువురు న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం రాష్ట్రపతి టీ-బిల్లును అసెంబ్లీ బాట పాట్టించాడని సమాచారం. టీ-ఈరోజు సాయంత్రం లోగా అసెంబ్లీకి చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. అలా.. ఇక్కడికి చేరిన టీ-బిల్లుపై మన నేతలు చర్చిస్తారన్న మాట. మరోవైపు, టీ-బిల్లుకు మద్దతు కూడగట్టడానికి టీ-నేతలు, వ్యతిరేకించడానికి సమైక్యవాదులు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు.