ఏపీ లో ఫస్ట్ కరోనా మృతి…

నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇక ఇప్పుడు మొదటి కరోనా మృతి నమోదు అయ్యింది. ఢిల్లీలో నిజాముద్దీన్‌ జమాత్ ప్రార్థనలకు వెళ్లిన ఓ వ్యక్తి ఈ నెల 17న విజయవాడకు తిరిగొచ్చాయి. సదరు వ్యక్తి నుంచి ఆయన తండ్రికి (55) కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మార్చి 30న కరోనా లక్షణాలతో ఆయన విజయవాడ జనరల్ ఆస్పత్రికి వచ్చారు. అయితే ఆయన వచ్చాక పరీక్షలు నిర్వహించిన గంటలోపే మరణించారు. మృతి చెందిన వ్యక్తికి షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉండటంతో ఇది కరోనా మరణంగా గుర్తించేందుకు జాప్యం జరిగింది. అయితే చివరకు ఆయన కరోనా వైరస్ వల్లే మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది.