1900 చేరువలో ఏపీ కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 7320 శాంపిల్స్‌ను పరీక్షించిన వైద్యులు కొత్త కేసులను కనుగొన్నారు. దీంతో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1887కు చేరింది.

అలాగే ఈ 24 గంటల్లోనే కరోనా తో ముగ్గురు మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 1004 మంది చికిత్స పొందుతుండగా, 842 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక జిల్లాల వారీగా కరోనా కేసులు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.