Site icon TeluguMirchi.com

రోజాకి అనురాధ వార్నింగ్


వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పంచుమర్తి అనురాధ. భూ కుంభకోణాల చరిత్ర కలిగిన రోజా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు అనురాధ.

హైదరాబాదులో ఆమె సోదరులు చేసిన భూ కబ్జాల విషయం అందరికీ తెలిసిందేనని , . ఈ వివాదంలో తన సోదరులను కాపాడుకోవడానికే ఆమె వైసీపీ పంచన చేరారని ఆరోపించారు రాజశేఖర్ రెడ్డి మొనగాడు, దమ్మున్న మొగాడు అంటూ డబ్బా కొట్టుకునే రోజాకు… ఆయన హయాంలో నాదర్ గుల్, పుప్పాల గూడ, ఔటర్ రింగ్ రోడ్లలో జరిగిన భూ కుంభకోణాల గురించి తెలియదా? అని ప్రశ్నించారు.

భూ కుంభకోణాలపై వేసిన సిట్ ను కోరల్లేని పాముగా రోజా అభివర్ణించడాన్ని అనురాధ తప్పుబట్టారు. గతంలో లిక్కర్ మాఫియాపై సిట్ వేస్తే… వైసీపీ నేత బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియా మొత్తం బయటకు వచ్చిందని గుర్తు చేశారు.

రోజా వైఖరి గురివింద గుంజను గుర్తుకు తెస్తోందని భూ కుంభకోణాలపై నీతి వాక్యాలను రోజా పలుకుతుండటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు అనురాధ.

Exit mobile version