Site icon TeluguMirchi.com

జగన్ కేసులో అనుబంధ ఛార్జిషీట్ !

jaganజగన్ అక్రమాస్తుల కేసులో మొదటి ఛార్జిషీటుకు రెండవ అనుబంధ ఛార్జిషీటును సీబీఐ ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసింది. ఫార్మా కంపెనీల వ్యవహారాన్ని సీబీఐ ఈ అనుబంధ ఛార్జిషీటులో పేర్కొంది. మొత్తం 29 పేజీల ఛార్జిషీటులో 8 డాక్యుమెంట్లు వున్నాయి. 9 మంది సాక్షులను విచారించినట్లు అనుబంధ చార్జిషీట్ లో పేర్కొంది. ట్రైడెండ్ లైఫ్ సెన్సెస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ కంపెనీలు ఆరోవోసీ నిబంధనలు ఉల్లంఘించి జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులు పెట్టాయని ఛార్జ్ షీట్ లో వివరించింది. ట్రైడెండ్ లైఫ్ సెన్సెస్, అరబిందో ఫార్మా, హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఆర్వోసీ నివేదికను కోర్టుకు సమర్పించింది. మరోవపు జగన్ అక్రమాస్తుల కేసులో.. జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని ఈ రోజు న్యూఢిల్లీలో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. ఈడి అధికారులు విజయ సాయి రెడ్డిని దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించినట్లు తెలుస్తోంది.

Exit mobile version