దాదాపు వందేళ్ల క్రితం చోరీకి గురైన మాతా అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి కాశీకి పయనమైంది. ఈ విగ్రహాన్ని ఇటీవల కెనడా నుంచి భారత్‌కు తీసుకురాగా.. గురువారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అందజేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఈ విగ్రహాన్ని యూపీ ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ,మీనాక్షీ లేఖి సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.