ఈ రోజు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతి. విజయవాడలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతి సందర్బంగా అయన విగ్రహానికి సీఎం చంద్రబాబు గారు పూల మాల వేశారు. తెలుగు వారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని సీఎం చంద్రబాబు గారు కొనియాడారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం పంతులు పోరాటాన్ని, సేవలను స్మరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. ఆయన ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి , తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు. గాంధీజీ పిలుపు మేరకు ఆనాడు ఆంధ్రావనిలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకివ్వరంటూ, నెహ్రూనే నిలదీసిన నాయకుడు.
తెలుగు జాతి ఉన్నత వరుకు తెలుగు వారి గుండెల్లో ఉండే నాయకుడు, తెలుగు వారు ముద్దుగా పిలుచుకునే “ఆంధ్రకేసరి” కి మా తెలుగు మిర్చి తరుపున నివాళి అర్పిస్తున్నాము.