Site icon TeluguMirchi.com

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఈ సమయంలో వారి ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్స్ , పోలీస్ , పారిశుధ్య కార్మికులకు అంత సెల్యూట్ చేస్తున్నారు.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏకంగా కార్మికుల పాదాలను కడిగి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యంత క్లిష్ట సమయంలో కూడా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

ఇక కార్మికుల కనీసవేతనం రూ. 18 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికుల సేవలను గుర్తించి వారికి కనీస వేతనం అందేలా చూస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు.

Exit mobile version