వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం తెలుగు దేశం పార్టీ ఫై అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేస్తుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు ఫై తనదైన స్టయిల్ లో విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. ఆంధ్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐదు కోట్ల ప్రజల తరపున మాట్లాడాల్సిన చంద్రబాబు కేవలం ముగ్గురి ఉద్యోగాల కోసం పాటుపడుతున్నారంటూ దుయ్యబట్టారు.
‘ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల ప్రజానీకం తరపున మాట్లాడాల్సిన వ్యక్తి భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తన పరిధిని తనే కుదించుకుంటూ పోతున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!’ అంటూ కామెంట్స్ చేసాడు.
మరో ట్వీట్ లోపావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై చురకలు వేసాడు.
ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల ప్రజానీకం తరపున మాట్లాడాల్సిన వ్యక్తి భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తన పరిధిని తనే కుదించుకుంటూ పోతున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 12, 2020
పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 12, 2020