Site icon TeluguMirchi.com

టీఆర్ఎస్ నేతకు టీటీడీ బోర్డు సభ్యుని ఛాన్స్ ఇస్తారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు..వచ్చి రాగానే అధికారుల వేటు వేసాడు..కీలక అధికారులను మార్చేసి..వారి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చాడు. పలు విభాగాల్లో కూడా అధికారుల మార్పులు జోరుగా జరిగిపోతున్నాయి..ఇక మిగిలింది టీటీడీ బోర్డు సభ్యుని పదవి..ఈ పదవి కోసం సినీ నటుడు, వైసీపీ అభ్యర్థి మోహన్ బాబు తెగ ట్రై చేస్తున్నాడు..ఈయనకే దాదాపు ఖరారు కావొచ్చనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ రేసులో తెరాస నేత పేరు బయటకొచ్చింది.

టీటీడీ బోర్డు సభ్యునిగా టీఆర్ఎస్ నేతకు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ ఛాన్స్ దక్కనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. టీటీడీ పాలకమండలి లో సంప్రదాయం ప్రకారం దక్షిణాది రాష్టాలు ఆయన తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్టాలు నుంచి బోర్డు సభ్యులుగా నియమించాలి. అందులో భాగంగా తెలంగాణ కోటాలో పొంగులేటికి జగన్ ఛాన్స్ ఇస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పొంగులేటికి ఈ పదవి ఇవ్వాలి అన్నట్లు జగన్ ను వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version