Site icon TeluguMirchi.com

పవన్ ను చిడతల నాయుడు అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం గుడివాడ లో వైసీపీ మంత్రుల ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ లో ఉన్న నాని లందరి ఫై పంచ్ ల వర్షం కురిపించారు. ఈ పంచ్ లకు వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రులు కొడాలి నాని, అవంతి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్ కౌంటర్ లు వేయగా..

తాజాగా రవాణా శాఖమంత్రి పేర్ని నాని మీడియా మీట్ పెట్టి మరి పవన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్‌ను చిడతల నాయుడు అంటూ సంబోదిస్తూ ఆయన కౌంటరిచ్చారు. నాని అంటే ఎవరో తెలియదన్న పవన్ వ్యాఖ్యలకు పేర్ని స్పందిస్తూ ఇంతకీ ఆయన ఎవరు..? అంటూ ప్రశ్నిస్తూ.. మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయనేనా పవన్ అంటే.. అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని మంత్రి.. ‘చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ కల్యాణ్ దిట్ట. హైటెక్స్‌లో మీటింగ్ పెట్టి చిడతలు ఎవరికి కొట్టారు..?. ముందు ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడతలు కొట్టారు. 2014లో చిడతల నాయుడు చంద్రబాబుకు ఓటేయ్యమన్నారు. నేను ఏం చేసినా వైఎస్ కుటుంబానికే చేస్తాను. క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ పవన్ కల్యాణ్‌ది. చిడతలు వాయించడంలో కూడా డబ్బులు సంపాదించిన ఘనత భూ ప్రపంచంలో చిడతల నాయుడికి మాత్రమే సొంతం. పార్టీ పెట్టింది గుర్తుంది కానీ.. ప్రశ్నించడం మర్చిపోయాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Exit mobile version