జగన్ కు బర్త్ డే విషెస్ అందించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 49 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా వైసీపీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. రక్త దానాలు , పలు సేవ కార్యక్రమాలు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇతర పార్టీ నేతలు , సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా జగన్ కు బర్త్ డే విషెష్ అందించారు.

ఈ క్రమంలో జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే జగన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని మహేష్‌బాబు ఆకాంక్షించాడు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మహేష్ ట్వీట్ చేశాడు.