వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల ఫై ఎప్పుడు డేగ కన్ను వేసే సాయిరెడ్డి..ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ఫై , ఆ నేతల ఫై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నీకు గ్రౌండే లేదు అంటూ సెటైర్లు వేసి హాట్ టాపిక్ అయ్యాడు.
జగన్ ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు, మొండి వైఖరి, ఏకపక్ష నిర్ణయం తీసుకుందని… రమేష్ కుమార్‌ను తొలగించడం ద్వారా తమ వైఖరి ఏ మాత్రం మారలేదని మరోసారి రుజువు చేసిందని ఆరోపించారు. ముఖ్యమైన విషయాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయిని… వీటన్నిటిలోనూ హైకోర్టులో చీవాట్లు పెట్టించుకున్నా ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వ వ్యవహారం అని పవన్ అనడం తో విజయసాయి పవన్ ఫై విరుచుకపడ్డాడు.
కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా? అని సెటైర్లు వేశారు.
కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 11, 2020