Site icon TeluguMirchi.com

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పవన్ డిమాండ్స్

ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పలు వాటిపై డిమాండ్స్ చేసారు. ప్రస్తుతం కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తుంది. వేల సంఖ్యలో ఈ కరోనా బారిన పడి హాస్పటల్స్ లలో చికిత్స తీసుకుంటున్నారు. ఇక వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం పనిచేస్తున్న వైద్య బృందానికి జై జైలు పలికారు పవన్.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మన దేశ సొంతమన్నారు. తమకు, తమ కుటుంబానికి వైరస్ ముప్పు ఉంటుందని తెలిసి కూడా రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసారు. కరోనా విధుల్లో ఉన్నవారందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేసారు.

Exit mobile version